ముద్దుల కన్నయ్యను ముస్తాబు చేయడానికి కొన్ని టిప్స్ మీకోసం.
1. పిల్లలకు స్నానం చేయించి.. సాధారణ టాల్కం పౌడర్ రాయాలి. తర్వాత చర్మం రంగుకు నప్పే కాంపాక్ట్ పౌడర్ రాయాలి. కళ్లకు నీలం రంగు ఐ షాడో వేసుకోవచ్చు. ఇవన్ని కూడా మీ ప్రాధాన్యతను బట్టే వేసుకోవాలి.
2. పిల్లల సైజు ధోతీ- కుర్తా మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పసుపు లేదా నారింజ రంగు ధోతీ- కుర్తా వేస్తే కృష్ణుడిలా కనిపిస్తారు.
3. ధోతీ, కుర్తాకు సరిపోయే రంగు కిరీటాన్ని లేదా తలపాగ తయారు చేసి నెమలి ఈకలు పెట్టాలి
4.పిల్లల మెడలో తెల్లటి ముత్యాల దండను వేసి వేణువును చేతిలో పెట్టాలి
5.కృష్ణుడి వేషంలో మరో ముఖ్యమైన అంశం ఆభరణాలు. పిల్లలకు హారాలు, కంకణాలు, చీల మండలు వంటి ఆభరణాలు వేయాలి
6. మట్టి కుండలో దూదిని పెట్టి. వెన్న కుండలా తయారు చేసుకోవచ్చు.