సోపోర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

83చూసినవారు
సోపోర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు సంచారిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు సోపోర్‌ పోలీసులు, 32 నేషనల్‌ రైఫిల్స్‌ సంయుక్త బృందం రఫియాబాద్‌, సోపోర్‌లో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఈక్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నారు. హతమైన ఉగ్రవాది ఎవరనేది తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్