సాంకేతిక లోపం కారణంగా పాక్ లోకి ప్రవేశించిన భారత ఆర్మీ డ్రోన్

577చూసినవారు
సాంకేతిక లోపం కారణంగా పాక్ లోకి ప్రవేశించిన భారత ఆర్మీ డ్రోన్
భారత సైన్యానికి చెందిన టాక్టికల్ యూఏవీ అంటే స్విచ్ డ్రోన్ శుక్రవారం నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లో పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డ్రోన్ అనుకోకుండా సరిహద్దు దాటింది. ఈ ఘటన రాజౌరీ సెక్టార్‌లో చోటుచేసుకుంది. కాగా.. పాక్ ఆర్మీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ డ్రోన్ సాధారణ నిఘా డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్