రేషన్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత అనిసౌర్ రెహమాన్‌ను ఈడీ అరెస్ట్ చేసినట్లు శుక్రవారం తెలిపింది. నార్త్ 24 పరణాల జిల్లాలోని బ్లాక్ అధ్యక్షుడైన అనిసౌర్ రెహమాన్, అతని సోదరుడిని గురువారం కోల్‌కతా కార్యాలయంలో సుమారు 14 గంటల పాటు ఈడీ విచారించింది. అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సిటీ కోర్టులో హాజరుపరుస్తామని ఈడీ పేర్కొంది.