తెలంగాణలో ఇవాళ ప్రభుత్వం పబ్లిక్ హాలీడే ఇచ్చింది. రంజాన్ తర్వాతి రోజు సెలవుగా ప్రకటించడం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. కాగా ప్రైవేటు ఆఫీస్‌లు కొనసాగనున్నాయి. ఇక ఏపీలోఇవాళ ఆప్షనల్ హాలిడే ఉంది. టెన్త్ సోషల్ ఎగ్జామ్ యథావిధిగా జరగనుంది. స్కూళ్లు కొనసాగడంపై స్థానిక డీఈవోలు నిర్ణయం తీసుకోనున్నారు.