ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. నందమూరి తారక రామారావు నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. 'అన్నగారు' అని అందరూ ఆప్యాయంగా తలుచుకునే వ్యక్తి ఆయన. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత NTR జయంతి నేడు.