ఆకాశంలో హరివిల్లును చూసిన ప్రతీసారి, అది దేవునితో మనిషికి ఉన్న అనుబంధానికి చిహ్నంగా భావిస్తారు కొందరు. తెరపై మహా హాస్యనటుడు అల్లు రామలింగయ్యను చూడగానే తెలుగువారికి అలాంటి అనుబంధమే గుర్తుకు వస్తుంది. తెలుగునాట వెండితెరపై వేయి చిత్రాలలో వెలిగిన తొలి నటుడుగా అల్లు రామలింగయ్య చరిత్ర సృష్టించారు. సదరు చిత్రాలలో వేళ్ళ మీద లెక్కపెట్ట దగ్గవాటిని పక్కకు నెడితే, అన్నిటా అల్లువారి నవ్వులే విరబూశాయి. ఇవాళ అల్లు రామలింగయ్య 21వ వర్ధంతి.