ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూలై 20న అంతర్జాతీయ చదరంగం దినోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. చదరంగం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటలలో ఒకటి. మన దేశంలో చదరంగం ఆట రాజుల కాలం నుంచే ఎంతో ప్రఖ్యాతి చెందింది. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఆడే ఈ మేధోపరమైన, సాంస్కృతిక, చారిత్రక ఆటకు గుర్తింపు తీసుకురావడం కోసం జూలై 20వ తేదీని ప్రపంచ చదరంగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.