మన సమాజంలో ఇతరులకు సాయం చేయడమే జీవిత పరమావధిగా భావించినవారు ఉన్నారు. ఇతరులకు సాయం చేయడం కోసం జీవితాల్ని త్యాగం చేసిన వారున్నారు. ఇతరులకు సాయం చేస్తూ ప్రాణాలు అర్పించిన వారున్నారు. ఒకరు కష్టంలో ఉన్నారన్నా, ప్రమాదంలో ఉన్నారన్నా వారికి సాయం అందించాలంటే గొప్ప మనసుండాలి. అలాంటి మనసున్న మహనీయులందరినీ ఇవాళ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇవాళ ‘ప్రపంచ మానవతా దినోత్సవం’.