మామిడిలో ఈ సమస్యను నివారించడానికి 19-19-19 @ 10 గ్రాములను లీటరు నీటికి మరియు ప్లానోఫిక్స్ అనే హార్మోన్ మందు 1 మి.లీటర్‌ను 4.5 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషకాల నివారణకు ఒక మొక్కకి 30 కేజీల పశువుల ఎరువు, 100 గ్రాముల జింక్ సల్ఫేట్, 100 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్‌ను ఉపయోగించడం వల్ల మామిడిలో సూక్ష్మపోషకాల లోపాలను అధిగమించి అధిక దిగుబడులను పొందవచ్చు.