రూల్స్ పాటించాలని చెప్పే పోలీసే రూల్స్ బ్రేక్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని దిల్ కుషా రైల్వే గేట్ వద్ద.. రైలు వస్తుండడంతో గేటు వేశారు. ఈ క్రమంలోనే వాహనదారులందరూ గేటు వద్ద ఆగారు. అటువైపుగా వస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఆగకుండా ప్రమాదకరంగా రైల్వే గేట్ కింద నుంచి బండి తోసుకుంటూ వెళ్లిపోయాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.