నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం (వీడియో)

25132చూసినవారు
మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి సరితా తివారీ, బావ రాజేష్ తివారీ అలియాస్ మున్నా తివారీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బీహార్‌‌లోని గోపాల్‌గంజ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్‌కు వెళ్తుండగా వారి కారు జార్ఖండ్ రాష్ట్రం నిర్సాలో శనివారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రాజేష్ చనిపోగా, సరిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్