ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

60చూసినవారు
UPలోని షాజహాన్పూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. బరేలీ-ఇటావా హైవేపై బర్ఖెడా జైపాల్ క్రాస్‌రోడ్డు సమీపంలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రియాజుల్ అలీ(45), అమ్నా(42), గుడియా(9), తమన్నా అను(32), నూర్ (6) ఘటనా స్థలంలోనే మరణించారు. గాయపడిన గుల్ఫీషా (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్