మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

83చూసినవారు
మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
AP: కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో రోజు రోజుకూ ఫిర్యాదులు పెరిగిపోయాయి. పలు మంత్రిత్వ శాఖల్లో పరిష్కారం చూపాల్సిన ఫైళ్లు కుప్పలు కుప్పలుగా మిగిలిపోతున్నాయి. దీంతో మంత్రులు సక్రమంగా సాంకేతికతను వినియోగించుకోలేకపోతున్నారని సీఎం మండిపడ్డారు. ’ఏ మంత్రి వద్ద ఏ ఫైలు ఎంతసేపు పెండింగ్‌లో ఉంటుందో తెలుసు. వాటిని వెంటనే క్లియర్ చేయాలి’ అని బాబు వారికి సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్