ప్రసవ సమయంలో గుండెపోటు రావడంతో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విక్రమ్‌గడ్ తాలూకాలోని గల్తారే గ్రామానికి చెందిన వైభవ్ పడ్వాలే (31)కు పురిటి నొప్పులు రావడంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రసవ సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో తల్లి, బిడ్డ మృతి చెందినట్లు సూపరిడెంట్ భరత్ మహాలే తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.