తెలంగాణలో 5 నెలల వ్యవధిలో 6,916 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన రవాణా శాఖ

67చూసినవారు
తెలంగాణలో 5 నెలల వ్యవధిలో 6,916 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన రవాణా శాఖ
ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో గత 5 నెలల వ్యవధిలో నిబంధనలు ఉల్లంఘించిన 6,916 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామని తెలంగాణ రవాణా శాఖ తెలిపింది. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్ వంటి కారణాలతో లైసెన్స్‌లు రద్దు చేసిటనట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాలతో 35,053 మంది మరణించారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్