నీట్ యూజీసీ పేపర్ లీక్‌తో బిహార్ రాష్ట్రానికి చెందిన 155 మందికి లబ్ధి చేకూరిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంలో ఐఐటీ మద్రాస్ రిపోర్టును కూడా పూర్తిగా అధ్యయనం చేశామని ధర్మాసనం వెల్లడించింది. పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు కోరుతున్నా.. దేశ అంతటా పేపర్ లీక్ అయినట్లుగా ఆధారాలు లేవని తెలిపింది. ఒకవేళ పరీక్షను నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొంది.