US అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఎంపికయ్యారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో RNC ప్రతినిధులు ఓటు వేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతరం తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ట్రంప్ ప్రకటించారు. ఒహియో రాష్ట్రానికి చెందిన జేడీ వాన్స్ ఈ పదవికి సరిగ్గా సరిపోతారని X వేదికగా తెలిపారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత అతడిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.