ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు..!

78చూసినవారు
ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని ఆదేశిస్తూ ట్రంప్‌ కార్యవర్గం ఓ మెమో జారీ చేసింది. వారికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి.

సంబంధిత పోస్ట్