అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ర్యాలీ కోసం మోంటానాకు వెళ్లడానికి ట్రంప్ శనివారం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దాని కారణంగా అతని విమానం రాకీ పర్వతాలకు అవతలి వైపు ఉన్న ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం లేదని విమానాశ్రయ సిబ్బంది పేర్కొన్నారు