టర్కీ అధ్యక్షుడు నిర్వాకం.. ముద్దు పెట్టనందుకు చెంపదెబ్బ

68చూసినవారు
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. జూలై 27న రైజ్ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి ఇద్దరు చిన్నారులను ఆహ్వానించారు. సంప్రదాయం ప్రకారం ముద్దుల కోసం అధ్యక్షుడు తన చేతిని ఇచ్చారు. కానీ ఓ బాలుడు ముద్దు ఇవ్వకపోవడంతో చిన్నారి చెంపపై ఎర్డోగాన్ ఒక్కటిచ్చారు. ఆ తర్వాత సిబ్బంది చెప్పడంతో ఆ బాలుడు అధ్యక్షుడి చేతిని ముద్దు పెట్టుకొని హగ్ చేసుకుంటాడు. ఈ వీడియో నెట్టింట వైరలయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్