పసుపు పంట కోసం ఎంచుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి. ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగా మారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుసగా రెండు పంటలు వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పసుపు పంటకు ఎక్కువగా వచ్చే తెగుళ్ళు, దుంపకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు (తాటాకు తెగులు). వీటి వల్ల పంట దిగుబడి చాలావరకు కోల్పోయే ప్రమాదము ఉంది.