రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక సిద్ధం చేసింది. రైతుభరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థికసాయం పథకాలను పండగ నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ రెండు పథకాల అమలు కోసం దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో ఈ రెండు స్కీమ్స్‌కు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. రైతుభరోసా సాయాన్ని ఎకరాకు రెండు విడతలుగా రూ.15 వేలకు అందించనుంది. భూమి లేని రైతు కూలీలకు మొదటి విడతగా రూ.6వేలు అందించనుంది.