పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో విషాదం చోటుచేసుకున్నది. అక్కడి బెజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతోంది. ఈ మేరకు పోర్చుగల్‌లోని డజన్ల కొద్ది మిలటరీ విమానాలు, హెలికాప్టర్లు ఒకచోట చేరాయి. ఈ క్రమంలో ఆరు విమానాల పైలట్లు తమ సాహసాలను ప్రదర్శించారు. ఆ సమయంలోనే రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఓ పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.