AP: ఇద్దరు గిరిజనులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మనోహర్, మహాలక్ష్మమ్మ వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. పొలంలో బోల్తా పడిన ఆటోను పైకి తీసుకొచ్చేందుకు మనికలా నరసయ్య (24), పొట్లూరి పోలయ్య (45)ల సహాయం కోరారు. ప్రమాదావశాత్తు పొలంలో విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.