ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యింది. వ్యాధి లక్షణాల గురించి అధికారులు మరింత విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అనుమానిత రోగులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనారోగ్యం బారినపడి కొరియా జిల్లాలోని పండోపరాకు చెందిన 51 ఏళ్ల మహిళ, జంజ్‌గిర్ చంపాలోని లక్షన్‌పూర్ కు చెందిన 66 ఏళ్ల మహిళ మృతిచెందారు.