అల్ట్రాటెక్ సిమెంట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో రూ.1,696.59 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.1,688.45 కోట్లతో పోలిస్తే పెద్దగా మార్పులేదు. కార్యకలాపాల ఆదాయం రూ.17,737.10 కోట్ల నుంచి 1.87% పెరిగి రూ.18,069.56 కోట్లకు చేరుకుంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో విక్రయాల పరిమాణం 7% పెరిగి 31.95 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. విక్రయాల ద్వారా వచ్చిన నగదు మాత్రం 5.7% తగ్గింది.