రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తొలిసారిగా వాడిన పోర్టబుల్ బ్రిడ్జిలను వయనాడ్ సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన 110 అడుగుల వంతెనను సహాయక చర్యల్లో వాడుతున్నారు. ఈ బ్రిడ్జిలను హెలికాప్టర్ల సాయంతో ఒకచోటి నుంచి మరోచోటికి సులభంగా తరలించవచ్చు. ఇటువంటి మరో బ్రిడ్జిని తయారు చేయాలని భారత ఆర్మీ భావిస్తోంది.