IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే JEE అడ్వాన్స్డ్-2025 నుంచి మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు (JAB) యూ టర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే వరుసగా రెండుసార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని జరిగిన JAB సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు IIT కాన్పుర్ ప్రకటించింది. దీంతో గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు.