మెగా హీరో వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇవాళ ఓ స్పెషల్ పెళ్లి వీడియోను షేర్ చేసారు. పెళ్లి వేడుకల్లోని కొన్ని విజువల్స్‌ని కలిపి స్పెషల్‌గా వీడియో చేసారు. ఈ వీడియోలో వరుణ్–లావణ్య పెళ్లి, కుటుంబ సభ్యులు డ్యాన్స్‌లు వేయడం, అందరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, ఫోటోషూట్స్.. ఇలా అన్ని చూపించారు. దీంతో ఈ వీడియో క్యూట్‌గా ఉందని అభిమానులు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.