డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తెస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఈదుపురం సభలో సీఎం మాట్లాడారు. గతంలో డ్వాక్రా సంఘాలలో 10 మంది సభ్యులతో ప్రారంభించి పావలా వడ్డీ, రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామిక వేత్తే లక్ష్యమన్నారు. ఆడ పిల్లలకు సమాజంలో గౌరవం ఉండాలని, దాని వల్ల కుటుంబానికి, ఆ గ్రామానికి మంచి పేరు వస్తుందని, ఫలితంగా కుటుంబం బాగుంటుందని చంద్రబాబు తెలిపారు.