స్వీడన్‌లో ఇటీవల జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ల్యాండ్‌స్క్రోనా పట్టణంలో ఎమిలియా స్జోబెర్గ్ (14) అనే బాలిక ఓ పార్టీకి బయల్దేరింది. ఆమెను దుండగులు కిడ్నాప్ చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. అంతేకాకుండా కత్తితో శరీరంపై గాయాలు చేశారు. పోలీసులు గాలించగా ఆమె మృతదేహం లభ్యమైంది. ఇక ఈ కేసులో 15 ఏళ్ల ఇద్దరు బాలికలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.