సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ కుమార్ మత్తు పదార్థాలకు బానిసవుతున్న విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు. జీవితంలో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని అదే మన బలమైన మనసు, శక్తి, మరియు దృఢ సంకల్పం అని సూచించారు. ఈ ప్రపంచంలో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా,ఒక మంచి నిర్ణయం తీసుకోవడమే అన్నీ మారుస్తుందని సూచించారు. యువత మత్తును వాడుతున్నప్పుడు అనుకోకుండా శరీరం, మనసు, జీవితాన్ని నాశనం చేస్తున్నారని తెలుసుకోవాలన్నారు. ఈ మత్తు పదార్థాలు శక్తిని తీస్తాయని, గొప్ప పనులు చేయగల శక్తిని,మనసు, ఆరోగ్యాన్ని ఆక్రమిస్తాయన్నారు. మత్తు ఇచ్చే నశ కేవలం కిక్కు వరకే కానీ అసలైన నశ కష్టపడ్డ వ్యక్తి సాధించినప్పుడు వస్తుందన్నారు. టీనేజ్ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అది అందరి జీవితాన్ని నిర్దేశిస్తుందని వ్యాఖ్యానించారు.
జీవితంలో ఉన్న ప్రతి క్షణం మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుందన్నారు. యువత ఈ సమయంలో మత్తు పదార్థాల హానిని అర్థం చేసుకుని, వాటిని వాడకూడదు అనే దృఢమైన సంకల్పాన్ని తీసుకోవాలి. దీని వలన మీలో ఉన్న శక్తి, ధైర్యం, మరియు ప్రతిభ ఎంతో విలువైనవిదిగా అర్థమవుతుందన్నారు. మీరు ఇంకా కొత్తగా, ప్రేరణతో, మీ జీవితాన్ని కొత్త దిశలో సెట్ చేయగలరని తేల్చిచెప్పారు. మీరు నిజంగా ఏమి కావాలంటే మీరు దానిని సాధించవచ్చు. విద్యార్థులుగా, మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మీ స్వంత శక్తిని కనుగొనాలని, మీ కలలను నిజం చేయాలని ఇది ఒక గొప్ప సమయంమన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సవాళ్లు వస్తాయి కానీ మీరు ఈ సవాళ్లను ఎదుర్కొని, విజయం సాధించేందుకు సిద్దంగా ఉండాలన్నారు
మీరు మత్తు పదార్థాల మీద ఆధారపడితే మీరు మీ జీవితం, ఆరోగ్యం, భవిష్యత్తు అన్నింటిని కోల్పోతున్నారని గుర్తు చేశారు. కానీ మీరు ఈ మత్తు పదార్థాలపై విజయం సాధిస్తే, మీరు మీ జీవితంలో అంతా అద్భుతమైన మార్పును తెచ్చుకోగలరు.
మీకు మీరు ఇచ్చే అప్రతిమ శక్తిని గుర్తించండి. మీరు అత్యధికమైన ప్రతిభను చూపించగలుగుతారు. మీరు మీకు నచ్చినది సాధించడంలో అడ్డంకి అయినప్పటికీ, ఆ అడ్డంకులు మీ జీవితంలో ఉన్నటువంటి మీరు చేసే పనులు, నిర్ణయాలు కాదు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ భవిష్యత్తును ఆపాదిస్తుంది.
ఇప్పుడు నిద్రకు పోకుండా, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీరు ఏమీ కావాలనుకుంటున్నా, అది సాధ్యమే. మీరు ముందుకు పోవాలి, మీరు గెలుస్తారు అని కితాబు ఇచ్చారు. మత్తుకు దూరంగా ఉండి మీరు శ్రమించి మీరు కలలుగన్న ఉద్యోగాన్ని, లేదా మీ లక్ష్యాన్ని చేరుకొని ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఆ మత్తును ఎంజాయ్ చేయండి అని తెలిపారు.