ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులపై ఆగ్రహంతో ఓ వ్యక్తి హిండన్ నదిలో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇంతలో దేవుడిలా మెరైన్ లో వర్క్ చేసే కమాండో నదిలోకి దూకి సదరు యువకుడిని కాపాడాడు. అనంతరం అతడ్ని ఆసుపత్రిలో చేర్పించగ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మెరైన్ కమాండోకి సెల్యూట్ చేస్తున్నారు.