VIDEO: నేపాల్‌‌లో భారీ వర్షాలు.. 66కి చేరిన మృతుల సంఖ్య

72చూసినవారు
నేపాల్‌ లో భారీ వర్షాలలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 66కు చేరిందని అధికారులు తెలిపారు. మరో 60 మందికి తీవ్రంగా గాయపడ్డారు. 79 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్