సుమన్ చిక్కాల దర్శకత్వంలో అందాల తార కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం 'సత్యభామ' ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది.