మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యశస్వి పవార్ (17) బాలికను ఆమె తల్లి, అమ్మమ్మ విషమిచ్చి చంపేశారు. ఈ సంఘటన థానేలోని జగ్‌తాప్ చాల్ ప్రాంతంలో జరిగింది. బాలిక యశస్వి పుట్టుకతోనే వికలాంగురాలు. ఆమె గత కొన్ని రోజులుగా తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతోంది. తన కూతురి బాధను తట్టుకోలేక, ఆమె తల్లి స్నేహల్ రాజేష్ పవార్ (35), అమ్మమ్మ సురేఖ ఆమెను చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.