VIDEO: మరోసారి రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు

69చూసినవారు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. ఆహారంలో నాణ్యత ఉండటం లేదని గురువారం ఆందోళన చేపట్టారు. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 'వి వాంట్ జస్టిస్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. మెస్ లో ఆహార నాణ్యతపై గతంలోనే ఆందోళన చేపట్టినా.. మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుందని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్