AP: విజయవాడలోని పున్నమి ఘాట్లో డ్రోన్ షో కళ్లు మిరుమిట్లు గొలిపేలా జరుగుతోంది. ప్రారంభ కార్యక్రమంలో కళాకారులు చేసిన ప్రదర్శన అందర్నీ అలరించింది. 'నాకముకా' సాంగ్కి యువతీ యువకులు చేసిన డాన్స్ సీఎం చంద్రబాబును ఆకట్టుకుంది. చివర్లో వారు సైకిల్ను ఎత్తిపట్టుకుని దానిపై కూర్చోవడంతో ఆయన నవ్వుతూ చప్పట్లు కొట్టారు.