వీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తిపై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ. వీడియోలో ఆయన నేరుగా షాపు దగ్గరకు వచ్చి చెంప దెబ్బ కొట్టడం చూడొచ్చు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా రౌడీలా వ్యవహరిస్తే ఎలా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.