ఓటీటీలోకి వచ్చేసిన విజయ్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’

82చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’
‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళ్‌ ఆడియోతో అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ 26న ఈ చిత్రం ఓటీటీలోకి రానుందంటూ ప్రచారం జోరుగా సాగినా సదరు సంస్థ స్పందించలేదు. ఎలాంటి ప్రకటన లేకుండా యూజర్లకు తాజాగా సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పరశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్