పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

62చూసినవారు
పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు
దోరేపల్లిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు మద్దూర్ ఎస్సై రాంలాల్ గురువారం తెలిపారు. లింగల్చేడు వాగునుంచి దోరేపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దోరేపల్లిలో పట్టుకున్నామన్నారు. పోలీసులపై దాడిచేసిన అనిల్, వెంకట్, అంజిలయ్య అనే వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అంజిలయ్య రెవెన్యూ కార్యాలయంలో ఎస్ఆర్ఓగా పనిచేస్తూ రవాణాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్