ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న ఎంపాక్స్‌లో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. తూర్పు ఆఫ్రికా దేశం బురండీలో ఎంపాక్స్ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వేగంగా విస్తరించే 'క్లాడీ 1బీ' అనే కొత్త స్ట్రెయిన్‌ను అక్కడి వైద్యాధికారులు గుర్తించారు. తమ దేశంలో ఇప్పటి వరకు 171 కేసులు పాజిటివ్‌గా తేలాయని, పక్క దేశమైన కాంగో నుంచి ఈ కొత్త వేరియెంట్ కేసులు వచ్చాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.