భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 156 ఎఫ్‌డీసీలను (ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్) తక్షణమే నిషేధించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. వీటిలో యాంటీబయోటిక్స్, నొప్పి నివారణలు, మల్టీవిటమిన్ల టాబ్లెట్లు ఉన్నాయి. ఈ మందులు ఆరోగ్యానికి ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.