అచ్యుతాపురం సెజ్
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ₹50లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా గాయపడిన వారికి ₹25లక్షలు ఇస్తామన్నారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబీకులతో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹కోటి చొప్పున ఇస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.