వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ వెల్కి చర్ల గ్రామంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం అందించారు. కార్యక్రమం లో పార్టీ అధ్యక్షులు పిల్లి నారాయణ, యూత్ అధ్యక్షులు మావూరు గళ్ళ ప్రభు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, పార్టీ సలహా దారుడు మాసగాళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.