కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన నాయకులు
కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), తదితర పార్టీ నాయకులు, ప్రతినిధుల బృందం శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను వామపక్ష నేతలకు సీఎం వివరించారు.