కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో 16 మంది నిందితులను పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. 50 మందికి పరిమితమైన పరిగి సబ్ జైల్ లో 80 మంది ఉండటంతో నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించారు. లగచర్ల గ్రామానికి పరిగి జైలు దగ్గరగా ఉండటంతో నిందితుల బంధువులు మూలాఖత్ కు కూడా ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.