దుద్యాల: లగచర్ల ఘటన దాడిపై ఎస్టీ కమిషన్ ఆరా

73చూసినవారు
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సోమవారం మహిళలతో సమావేశమై ఫార్మా కంపెనీకి భూసేకరణ, ఇటీవల జరిగిన దాడిపై ఆరా తీశారు. ఈ క్రమంలో మహిళలు పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కొందరిని అకారణంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలని, గిరిజనులను వేధిస్తే సహించేది లేదని ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్