చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసేందుకు జైలు వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్లపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.